పాలకొల్లు: పంచారామ క్షేత్రానికి భక్తుల తాకిడి
పాలకొల్లులోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే స్వామివారికి ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు జరిపించారు.