పాలకొల్లు: వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది: మంత్రి
పోలవరం ప్రాజెక్టు మీద వైఎస్సార్సీపీ నాయకులు మ మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగని అరుస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 45. 72 మీటర్ల నుంచి 41. 15 మీటర్లకి ఏదో కొత్తగా తగ్గిస్తున్నట్లు ప్రసారం చేయడం సిగ్గుచేటని అన్నారు.