సాంబయ్యపాలెంలో వైసీపీ ఎన్నికల ప్రచారం

80చూసినవారు
సాంబయ్యపాలెంలో వైసీపీ ఎన్నికల ప్రచారం
కొత్తవలస మండలం సాంబయ్యపాలెంలో స్థానిక వైసిపి నాయకులు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా నమూనా ఈవీఎం ను ఉపయోగించి ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. సంక్షేమ పథకాలు భవిష్యత్తులో సజావుగా అందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యేగా కడుబండి శ్రీనివాసరావును ఎంపీగా ఝాన్సీ ని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్