కల్వర్టులు డ్రైన్లు రోడ్లు నిర్మించుటకు అంచనాలు తయారు చేయండి

69చూసినవారు
కల్వర్టులు డ్రైన్లు రోడ్లు నిర్మించుటకు అంచనాలు తయారు చేయండి
బొబ్బిలి మున్సిపాలిటీలో కమిషనర్ ఎల్ రామలక్ష్మి క్షేత్ర స్థాయిలో బుధవారం పర్యటించారు. ఆమెతోపాటు మున్సిపల్ అధికారులు ఉన్నారు. మేదర బంద వద్ద మేజర్ స్ట్రామ్ వాటర్ డ్రైనుకు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు అవసరమైన మరమ్మతులు చేయించాలని అన్నారు. రత్నాల నహార్ కాలనీలో అవసరమగు కల్వర్టులు, డ్రైన్లు రోడ్లు నిర్మించుటకు అంచనాలు తయారు చేయవలసిందిగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ వారికి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్