చీపురుపల్లి: డయేరియాతో ఒక్కరు మాత్రమే మరణించారు

51చూసినవారు
చీపురుపల్లి: డయేరియాతో ఒక్కరు మాత్రమే మరణించారు
గుర్ల మండలంలో డయేరియాతో ఒక్కరు మాత్రమే మరణించారని వైద్యులు ధ్రువీకరించినట్లు జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుర్ల మండలంలో డయేరియాతో చికిత్స పొందుతున్న రోగులను గురువారం పరామర్శించారు. గుర్ల మండలంలో డయేరియా కేసులు నమోదు కాగానే తక్షణమే అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే గుర్లలో పర్యటించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్