చీపురుపల్లి నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షపాతం వివరాలను సోమవారం వ్యవసాయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా మెరకముడిదాం మండలంలో 16. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు. అదేవిధంగా గుర్ల మండలంలో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గరివిడి మండలంలో 1. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. ఇదిలా ఉంటే చీపురుపల్లి మండలంలో 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు.