రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలి

56చూసినవారు
రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలి
విజయనగరం జిల్లా కేంద్రం స్థానిక శేషగిరి విజ్ఞాన కేంద్రంలో ఈనెల 27న జరగనున్న రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా నాయకులు సత్య శ్రీనివాస్ శనివారం కోరారు. ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే గోడ పత్రికను విడుదల చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రస్థాయి సదస్సుకు సిబ్బందిని ఉపాధ్యాయులను కలసి ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు తెలిపారు. ఈ సదస్సుకు అందరూ విధిగా హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్