గజపతినగరం కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 541 కేసులు పరిష్కరించబడ్డాయి. న్యాయమూర్తి బి. కనకలక్ష్మి ఆధ్వర్యంలో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా, న్యాయమూర్తి కనకలక్ష్మి "రాజీయే రాజమార్గం" అని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బిట్రా సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.