సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ గా కె. వి. ఎన్ స్వర్ణ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. తారక రామ తీర్థసాగరం ప్రాజెక్టు కూడా ఆయన ఎస్ఈ గా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు ఆయన శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టు ఎస్ఈ గా చేశారు. ఆయను జిల్లా కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిశారు. బొబ్బిలి సర్కిల్ జలవనరుల శాఖ ఎస్ఈ గా ఆర్. అప్పారావు నియమితులయ్యారు.