ఎంసిసికి వ్యతిరేకంగా ఆలయ ప్రతిష్టకు ముహూర్తం

71చూసినవారు
ఎంసిసికి వ్యతిరేకంగా ఆలయ ప్రతిష్టకు ముహూర్తం
నెల్లిమర్ల మండలం సతివాడ గ్రామంలో నిర్మాణం చేపట్టిన రామాలయాన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా ప్రారంభించడానికి గ్రామ సర్పంచి ముహూర్తం ఖరారు చేశారని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. బుధవారం ఎంపీడీఓ రామారావు, పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం రూ. 10లక్షలు మంజూరు చేసిందని వెల్లడించారు. రాజకీయ లబ్ధికోసం ఆలయ ప్రతిష్ట చేస్తున్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్