రామతీర్థంలో వసంత నవరాత్రి ఉత్సవాలు

59చూసినవారు
రామతీర్థంలో వసంత నవరాత్రి ఉత్సవాలు
పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రామస్వామికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, లక్ష తులసీదళార్చన, కుంకుమార్చన అర్చక స్వాములు నిర్వహించారు. అనంతరం శ్రీమద్రామాయణ పారాయణం రుత్వికులు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇఓ వై శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్