పాలకొండ పోలీస్ స్టేషన్ ను విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టీ గురువారం సందర్శించారు. ఈ మేరకు స్టేషన్లోని రికార్డులు పరిశీలించారు. ఈ క్రమంలో క్రైమ్ రిపోర్ట్, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాల గురించి సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంజాయి, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ డిఎస్పీ, సీఐ, ఎస్ఐ పాల్గొన్నారు.