పార్వతీపురం: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

62చూసినవారు
పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో జరగబోయే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు శనివారం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వేదికతో పాటు ఆవరణ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం ఉ. 9 గం. లకు ముఖ్యఅతిథి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ చే జాతీయ పతాక ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. పోలీసుల కవాతు, మార్చ్‌ ఫాస్ట్‌ తదుపరి జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్‌ సందేశం చదివి వినిపిస్తారు.

సంబంధిత పోస్ట్