మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయవద్దని అధికారులకు సూచించారు.