మక్కువ మండలంలోని రాష్ట్ర జాతరగా గుర్తింపు పొందిన పోలమాంబ అమ్మవారి జాతర సమయం సమీపిస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండడంపై పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన శంబరలోని పోలమాంబ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. గోముఖీ నది ఒడ్డున ఏర్పాటు చేసిన ప్లాట్‌పారం నుండి నిర్మించిన మెట్లును కూడా పరిశీలించారు.