జంతువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు.. ఎస్పీ రాధిక

78చూసినవారు
జంతువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు.. ఎస్పీ రాధిక
జూన్ 17 వ తేదిన జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో జంతువుల అక్రమ రవాణా మరియు అక్రమ వధ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాధిక మంగళవారం సిబ్బందికి సూచించారు. ఈ విషయంలో ప్రజలకు ఏవిధమైన సమాచారముగాని, ఏదైనా ఇబ్బంది గాని జరిగినట్లయితే ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా తెలియజేయాలని ఎస్పీ సూచించారు. జిల్లా స్థాయి నోడల్ అధికారి ఫోన్ నెంబర్ 6309990803 నకు గాని సంప్రదించగలరని జిల్లా ఎస్పీ రాధిక సూచించారు.

సంబంధిత పోస్ట్