నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

556చూసినవారు
నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
మెంటాడ మండలంలో అక్రమంగా నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని ఆండ్ర ఎస్ఐ బొడ్డు దేవి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం గురువారం వచ్చిన ముందస్తు సమాచారం మేరకు మెంటాడ మండలం వాణిజ గ్రామ శివార్లలో అక్రమంగా బియ్యపు సారా తరలిస్తున్న జిల్లా అంతగిరి మండలంకు చెందిన వ్యక్తిని సిబ్బందితో అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని నుండి 60 లీటర్ల సారాను స్వాదినం చేసుకొని కేసు నమోదు చేశామని వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్