ఎస్. కోట మండలంలో హరే రామ హరే కృష్ణ నగర్ సంకీర్తన కార్యక్రమం

67చూసినవారు
ఎస్ కోట మండలం వినాయక పల్లి లో బుధవారం రాత్రి హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్గశిర ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీ రామాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏకాదశి రోజున హరే రామ హరే కృష్ణ నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ మేరకు శ్రీరామాలయ చెట్టును గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.

సంబంధిత పోస్ట్