ఘనంగా ప్రారంభమైన శ్రీ పరదేశమ్మ తల్లి తోలేళ్ళ ఉత్సవం

79చూసినవారు
ఘనంగా ప్రారంభమైన శ్రీ పరదేశమ్మ తల్లి తోలేళ్ళ ఉత్సవం
వేపాడ మండలం బక్కు నాయుడుపేటలో శ్రీ పరదేశమ్మ తల్లి తొలేళ్ళ ఉత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి పసుపు కుంకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి చీర, సారె సమర్పించారు. ఇందులో భాగంగా గ్రామంలో నిర్వహించిన ఎడ్ల పందాలు పలువురుని ఆకట్టుకున్నాయి. రేపు మంగళవారం అమ్మవారి అనుపోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్