ఎస్ కోట మండలంలో యధేచ్ఛగా త్రవ్వకాలు

69చూసినవారు
ఎస్ కోట మండలంలో యధేచ్ఛగా త్రవ్వకాలు
ఎస్ కోట మండలం పోతనాపల్లి, ఎస్ జి పేట, తలారి, వి ఆర్ పేట గ్రామాల్లో కొంతమంది అక్రమార్కులు చెరువు గర్భంలో మట్టిని యధేచ్ఛగా తరలిస్తున్నారు. రాత్రి 10 నుండి తెల్లవారి 4 వరకు జెసిబి తో త్రవ్వకాలు చేపట్టి చెరువు గర్భాలకు శోకం మిగులుస్తున్నారు. ఇందుకు సంబంధించి రెవిన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారుల చర్యలు శూన్యమని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలను అధికారులు ఆపాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్