జీవీఎంసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

68చూసినవారు
జీవీఎంసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ కుమార్ ను జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు పడాల రమణ మాట్లాడుతూ జీవీఎంసీ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాజువాక విలీన మండలాల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్