మధురవాడ: ట్యాంకర్ ను ఢీకొట్టిన టెంపో బస్సు
మధురవాడ నుంచి పీఎం పాలెం వెళ్లే రోడ్డులో మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిగ్నిల్ పాయింట్ దగ్గర ట్యాంకరు ఐటీ కంపెనీకి చెందిన టెంపో బస్సు ఢీకొంది. దీంతో ఆ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.