విశాఖ: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విశాఖదక్షిణ నియోజవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. భీమిలిలోని రాడిసన్ బ్లూ హోటల్లో పవన్ బస చేయడంతో వంశీకృష్ణ అక్కడకు వెళ్లి పుష్పగుచ్ఛం అందజేశారు. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై పవన్‌తో వంశీకృష్ణ చర్చించారు.