విశాఖ జిల్లా కూర్మనపాలెం జంక్షన్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎంపీ, బీఎస్పీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ రాంజీ గౌతమ్ పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపేయాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలన్నారు. ఉద్యోగులపై వేధింపులు ఆపాలని కోరారు.