సతీష్ కు జాతీయ యోగ టీచర్ అవార్డు
చోడవరం చెందిన యోగ టీచర్ పుల్లేటి సతీష్ కి ఉత్తమ జాతీయ యోగ టీచర్అవార్డు లభించింది. ఈ మేరకు ఆదివారం ఆయన వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు శివ జ్యోతి యోగ కేంద్రం వారుగత 20 ఏళ్ల నుండి దేశవ్యాప్తంగా యోగాకి సేవలందించిన ఉత్తమ యోగ గురువులకు ప్రతి ఏడాది బెస్ట్ యోగా టీచర్ అవార్డులు అందజేస్తారు. దానిలో భాగంగా ఈ ఏడాది చోడవరం పతాంజలి యోగ కేంద్రం నిర్వాహకుడు పుల్లేటి సతీష్ ను 2024 కి ఎంపిక చేసినట్లు చెప్పారు.