త్వరలో చెరకు బకాయిలు చెల్లింపు
చోడవరం సహకార చక్కెర కర్మాగారం పరిధిలో సభ్యులకు చెల్లించాల్సిన చివరి పేమెంట్ త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గోవాడ షుగర్ ఎండి వి. ఎస్ నాయుడు చెప్పారు. బుధవారం సాయంత్రం అయన విలేకరులతో మాట్లాడుతూ గోవాడ ఫ్యాక్టరీలో 2023-24 క్రషింగ్ సీజన్ కు గాను 170601. 054 మెట్రిక్ టన్నుల చెరకు గానుగాట జరగగా టన్ను ఒక్కింటికి 2500 రూపాయలు చొప్పున మొదటి విడతగా 42. 65 కోట్ల రూపాయలు ఇప్పటికే అందజేశామన్నారు.