విశాఖ: ఆర్థిక మోసాల ముఠా అరెస్టు
విశాఖ జిల్లాలో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగులు, ఇన్వెస్ట్మెంట్ స్కీముల పేరుతో పీస్ పే అనే చెల్లింపు గేట్ వే ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించినట్లు తెలిపారు. 9 ల్యాప్టాప్లు, 8 సిపియులు, తొమ్మిది మోనిటర్లు, టిఆర్అక్స్ యంత్రాలు, 65 మొబైల్ ఫోన్లు, ఒక బైక్, ఒక కారు, మూడు బంగారు రింగులు స్వాధీనం చేసుకున్నారు.