ఏపీ అసెంబ్లీలో ఇలా జరిగితే.. జగన్ సభ్యత్వం రద్దే!
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం మాజీ సీఎం జగన్ సభలకు గైర్హాజరు అవుతుండడమే. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 సభ్యులు, సభలకు రావాల్సిన విధానాలను స్పష్టం చేసింది. వరుసగా ఎవరైనా సభ్యుడు కనుక 60 రోజుల పాటు సభలకు హాజరు కాకపోతే.. సదరు సభ్యుడి సభ్యత్వం (ఎమ్మెల్యే) ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని ఈ ఆర్టికల్ కుండబద్దలు కొడుతోంది. జగన్ కనుక 60 రోజుల పాటు సభలకు వెళ్లకపోతే ఆయన సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశాలున్నాయి.