భూకబ్జాపై స్పందించిన కేతిరెడ్డి
AP: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్ చెరువును ఆక్రమించారంటూ నీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య వసుమతికి నోటీసులు జారీచేశారు. దీనిపై కేతిరెడ్డి స్పందించారు. ‘‘ ప్రస్తుతానికి ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక నాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని అన్నారు.