ఇలాంటి కూరగాయలు తింటే ప్రాణాపాయం (వీడియో)
మార్కెట్లో పండ్లు, కూరగాయలను చాలా మంది పరిశీలించకుండానే ఇంటికి తెస్తుంటారు. ఏ మాత్రం ఆలోచించకుండా వాటిని తినేస్తుంటారు. అయితే పొలాల్లో పాములు, ఇతర విషపూరిత జీవులు సంచరిస్తుంటాయి. ఇదే కోవలో ఓ తోటలో టమోటా పండును పాము కొరుకుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి పండ్లు, కూరగాయలు తింటే ప్రాణాపాయమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటివి తినవద్దని హెచ్చరిస్తున్నారు.