అనకాపల్లి
అనకాపల్లి: చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి, అచ్యుతాపురం, పరవాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన 9చోరీ కేసుల్లో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 21లక్షలు విలువ చేసే 188 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు మోటార్ బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి జిల్లాఎస్పీ తుహిన్ సిన్హా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చోరీ కేసుల్లో పురోగతి సాధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు