అనకాపల్లి పట్టణ ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలని కోరుతూ గురువారం కాయగూరల మార్కెట్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఏవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్. శంకరరావు మాట్లాడుతూ ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలని నోటీసు ఇచ్చి 22 రోజులు అయ్యిందని.. షాపుల యజమానులు కూలి రేట్లు 13 శాతం పెంచుతామనడం సరైనది కాదన్నారు