అనకాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం. రామారావు క్షేత్ర సందర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంటను తుఫాన్ తాకిడికి దెబ్బతినకుండా కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు సూచించారు. ముఖ్యంగా వరి కోతలు చేసిన వాళ్ళు వరిని కుప్పలుగా వేసుకోవాలన్నారు. పంట కోయని వాళ్ళు రెండు రోజులు ఆగిన తర్వాత పంట కోయాలన్నారు.