డుంబ్రిగుడ: వంతెన నిర్మాణం వేగవంతం చేయాలని విజ్ఞప్తి

54చూసినవారు
డుంబ్రిగుడ: వంతెన నిర్మాణం వేగవంతం చేయాలని విజ్ఞప్తి
డుంబ్రిగుడ మండలంలోని కించుమండ సంపంగిగెడ్డ వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కితలంగి సర్పంచ్ ఒరాబోయిన సుబ్బారావు సంబంధిత అధికారులకు, గుత్తేదారునికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన నిర్మితమవుతున్న వంతెన పనులను సందర్శించి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హాయంలో మంజూరైన వంతెన నిర్మాణం సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. గిరిజనుల రవాణా కష్టాలు తీర్చాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్