బుచ్చయ్యపేట మండలంలోని దిబ్బిడి గ్రామంలోనున్న శ్రీ మాణిక్యాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం మహా అన్న సమారాధనను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వేకువజాము నుంచే ఆలయ అర్చకులు దొంతుకుర్తి సన్యాసశర్మ ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి యేటా గ్రామస్తులు, విరాళ దాతల సహకారంతో అన్న సమారాధన జరుగుతుందన్నారు.