గొలుగొండ మండలం ఎల్లవరం గ్రామానికి వందరోజుల్లో రూ. 2. 81 కోట్లు విధులు మంజూరు చేసామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎల్లవరంలో శనివారం నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు.