నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ కౌన్సిలర్ల వాగ్వాదంతో ప్రారంభమైంది. గత ప్రభుత్వంలో చేసిన పనులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎందుకు బిల్లులు చెల్లించాలని జనసేన, టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ కూటమి కౌన్సిలర్లు రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. టీడీపీ కౌన్సిలర్ పద్మావతి సమాధానం చెప్పాలని కోరారు.