విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. వెంకట శేషమ్మ గురువారం నర్సీపట్నం సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న ఖైదీలతో మాట్లాడారు. న్యాయ సహాయం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికి కుటుంబం ఉంటుందని, ఆ కుటుంబం మీ మీదే ఆధారపడి జీవిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పరివర్తన కలిగి జీవించాలన్నారు.