అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సమస్యలతో వెంకటలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. నాతవరం మండలం మల్లుభూపాలపట్నం గ్రమానికి చెందిన వెంకటలక్ష్మి మంగళవారం ఉదయం తన కుమార్తెను కొట్టింది. దీంతో భర్త ఆమెతో గొడప పడ్డారు. మనస్తాపానికి గురైన మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.