విశాఖ: 122 బస్సులపై కేసులు నమోదు
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 నుంచి నేటి వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 122 బస్సులపై కేసులను నమోదు చేసినట్లు విశాఖ ఉప రవాణా కమిషనర్ ఆదినారాయణ బుధవారం తెలిపారు. ఎన్.ఏ.డి, ఎన్.ఎస్.టి.ఎల్, అగనంపూడి వద్ద ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయాని, అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.