మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం పాడేరు మండలంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్ దినేష్ కుమార్ ని మినీ అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. ఆ వినతిలో భాగంగా ప్రధానంగా మినీ అంగన్వాడీలకు కనీస వేతనాన్ని అమలు చేయాలని సెంటర్ల నిర్వహణ భారంగా ఉన్న 4 యాప్ లను కలిపి ఒకే యాప్ చేయాలని కోరారు. మినీ అంగన్వాడీలకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.