పాయకరావుపేట: 17 థీమ్స్ పై అవగాహన

85చూసినవారు
పాయకరావుపేట: 17 థీమ్స్ పై అవగాహన
ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయితీ కార్మికులకు అందజేయాలని పాయకరావుపేట మండలం ఈవోపీఆర్డీ సిహెచ్ చంద్రశేఖర్ శనివారం అవగాహన కల్పించారు. పాయకరావుపేటలో ప్రతి ఇంటికి, షాప్ కి వెళ్లి ఐఎస్ఎల్ మరుగుదొడ్లు వాడే విధానాన్ని వివరించినట్లు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి జీవీ లక్ష్మి, ఎంపీడీవో జయప్రకాశరావు సూచన మేరకు మొత్తం 17 థీమ్స్ పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్