పరవాడ ఫార్మసిటీలో టోరెంట్ పరిశ్రమలో ఆదివారం కెమికల్ పౌడర్ ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గనిశెట్టి తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులు పి. రామకృష్ణ, జె. బసవేశ్వరావును ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ విధంగా జరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు.