ఓ పేద వైశ్య కుటుంబంలో జరుగుతున్న అమ్మాయి వివాహానికి వాసవి క్లబ్ పాడేరు హిల్స్ వారు శనివారం సుమారు 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా కొంత సామాగ్రి కూడా అందజేసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వాసవి క్లబ్ ఉపాధ్యక్షుడు ఎస్ శ్రీను మాట్లాడుతూ తోటి వారికి సాయం చేయాలని దృక్పథంతో తమ క్లబ్బు సభ్యులు సత్యారావు కుమార్తె శ్రావణి పెళ్లి నిమిత్తం సుమారు రూ. 30వేలు అందజేశామన్నారు.