గాజువాకలోని షీలానగర్ లో మంగళవారం ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ చేస్తుంటాడు. మృతురాలు సాయి సుష్మిత ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తుంది. ఆరు నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గరావు వద్దకు సుష్మిత వచ్చి వెళ్తుందని స్థానికులు తెలిపారు. మృతులు ఇరువురు మధ్య వాగ్వాదం జరిగినట్టు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.