ఏలూరు: సైబర్ నేరాలకు గురైతే 1930 టోల్ ఫ్రీకి డయల్ చేయండి
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. వెబ్ సైట్ www. cybercrime. gov. in సందర్శించవచ్చున్నారు.