ఏలూరు నగరంలో భారీ చోరీ
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన ఏలూరు నగరంలోని సత్రంపాడులో శనివారం చోటుచేసుకుంది. విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జ్ఞానానందం 15 రోజుల క్రితం హైదరాబాదు వెళ్లి శనివారం ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలో ఉన్న 15 కాసుల బంగారం, 10 కేజీల వెండి, కొంత నగదు అపహరించుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.