రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో గురువారం మాలల న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం పట్ల డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.