తాడేపల్లిగూడెం పట్టణంలో లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జనత చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఆదివారం ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వలవల బాబ్జి ప్రారంభించారు. అనంతరం వైద్యులు ఉచితంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు.