తాడేపల్లిగూడెం: ముత్యాలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

69చూసినవారు
తాడేపల్లిగూడెం: ముత్యాలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే
తాడేపల్లిగూడెంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మతల్లి వారి దేవస్థానాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీసీ నాయకులు ఘంటా ప్రసాద్ రావు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కైకరం జనసేన నాయకులు శ్రీకాంత్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్